వైఎస్ఆర్ జలకళ రైతులకు వరం…
1 min readజలకళ నూతన బోర్లు ప్రారంభంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి..
పేద రైతులకు ముందుగా అవకాశం ఇవ్వాలని పి.డి.గారిని కోరిన గుమ్మనూరు నారాయణ స్వామి
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: వైఎస్ఆర్ జలకళ పథకం చిన్న, సన్నకారు రైతులకు వరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి అన్నారు.సోమవారం హోళగుంద, ఆలూరు మండల కేంద్రంలో మరియు హోళగుంద మండలంలోని రామ్ నాయక్ సమీపంలోని రైతు పొలంలో వైఎస్ఆర్ జలకళ క్రింద నూతన వ్యవసాయ ఉచిత బోరు తవ్వాకాన్ని పి.డి.ఆమర్నాధ్ రెడ్డి, గుమ్మనూరు నారాయణ స్వామి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ స్వామి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో వేసిన వ్యవసాయపు బోర్లు దెబ్బతిన్న పరిస్థితుల్లో పంటలను,తోటలను కాపాడుకునే నేపథ్యంలో అదనంగా బోర్లు వేయడానికి ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టడం ,అధిక వడ్డీలకు తెచ్చుకుని అప్పులు పాలయిన రైతుల బాధలను తన సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూసిన వై ఎస్ ఆర్ సి పి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఉచితంగా బోర్లు వేయిస్తామన్న హామీ నేడు నెరవేరుతుండడం ఆనందదాయకమన్నారు. వై ఎస్ ఆర్ జలకళ ద్వారా రైతులుకు ఉచితంగా బోరు, మోటారు, విద్యుత్ లైన్ ఇస్తున్నామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా జగనన్నప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైఎస్ఆర్ జలకళ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వ్యవసాయపు బోర్లను తవ్వడం, 5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చి, సుమారు మూడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుకంట కన్నీరు చూడకూడదన్నదే రైతు భరోసా కేంద్రాలు, పంటలకు మద్దతు ధర, విత్తనాలు, ఎరువులను సకాలంలో అందచేస్తూ రైతు పక్షపాతిగా సీఎం జగన్ పేరొందుతున్నారన్నారు. భగవంతుడి దయతో వర్షాలు సంవృద్దిగా పడ్డాయన్నారు. పంట రుణాలుకు సున్నా వడ్డీని అమలు పరిచారన్నారు.అక్టోబర్ లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు కూడా ఇన్ పుట్ సబ్సిడీ అందించారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధి ఏ పి డి ,ఏ.పి.ఓ., టి ఎ లు,ఫీల్డ్ అసిస్టెంట్ లు,సిబ్బంది, రైతులు,తదితరులు పాల్గొన్నారు.