అంగన్వాడీల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మద్దతు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : కనీస వేతనం 26000 ఉద్యోగ భద్రత అంగన్వాడి సెంటర్ల నిర్వహణ ఖర్చు పెంపు పిఎఫ్ గ్రాట్యుటీ అంగన్వాడి సెంటర్లకు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని తదితర డిమాండ్లు కోరుతూ గత 22 రోజుల నుండి( గడివేముల) మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టిన అంగన్వాడీలకు మంగళవారం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టిడిపి ఇన్చార్జి గౌరు చరిత రెడ్డి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి హయంలో ఎప్పుడు అంగన్వాడీలు 22 రోజులు సమ్మె చేయలేదని ప్రభుత్వం వారి డిమాండ్లను న్యాయమైన కోరికలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కో కన్వీనర్ సత్యం రెడ్డి మాజీ జడ్పిటిసి సీతారామరెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.