PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టరేట్ కు వెళ్తున్న అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు..

1 min read

నిరసనగా  రోడ్డుపై బైఠాయించిన అంగన్వాడీలు, సిఐటియు నాయకులు..                               

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 22 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ తమ డిమాండ్లపై ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న దేవనకొండ ,ఆస్పరి, ఆలూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలను దేవనకొండ పోలీసులు  ఈదుల దేవరబండ దగ్గర అడ్డుకొని కలెక్టరేట్ పోకూడదని నిలువరించారు, అందుకు నిరసనగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు నాయకులు తమ సమస్యల పరిష్కారం కొరకు కలెక్టరెట్ కు వెళ్లి తీరుతామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఈదుల దేవరబండ దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమను కలెక్టరేట్ పంపించే వరకు  రోడ్డు పైనే అడ్డంగా కూర్చుంటామని బీస్మించుకొని, నినాదాలు ఇస్తూ తమ డిమాండ్ల పరిష్కరించాలని, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నినాదాలు ఇస్తూ రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కె.పి నారాయణస్వామి దేవనకొండ మండల కార్యదర్శి అశోక్ లు మాట్లాడుతూ, ప్రభుత్వము సమస్య పరిష్కారం వైపు ప్రయత్నించాలి కానీ నిర్బంధం పెడితే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యలు కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత,  తదితర డిమాండ్స్ పై మాట్లాడకుండా మీరు సమ్మె విరమించండి, మీకు అన్నీ కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెబుతుందని, మాట వినకుంటే మీ అంతు చూస్తామని ప్రభుత్వం బెదిరిస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం వైపు నుండి సరైన చర్య కాదని అంగన్వాడీల డిమాండ్స్ ను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలపరిచిన ఈ ప్రభుత్వ  పెద్దలు ఇప్పుడు తప్పని మాట్లాడడం సరికాదని అన్నారు. రోడ్డుపై బైఠాయించిన సిఐటియు నాయకులు నారాయణస్వామి అశోక్  లను బలవంతంగా పోలీస్ జీఫ్  ఎక్కించి అరెస్ట్ చేసిన నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ముకుమ్మడిగా పోలీస్ జీప్ కు అడ్డుపడి నాయకులను వదిలిపెట్టాలని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు, పోలీసులు సిఐటియు నాయకత్వంతో మాట్లాడి రాస్తారోకో విరుంపజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సుజాతమ్మ, జయశ్రీ, భారతి, సరస్వతి, లక్ష్మీ, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

About Author