ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి విఫలం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని టిడిపి పత్తికొండ నియోజకవర్గం ఇన్చార్జి కే ఈ శ్యామ్ కుమార్ ఆరోపించారు. స్థానిక టిడిపి ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు,అధికార వైసిపి పార్టీ అధినేత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో 85% విఫలమయ్యారని ఆధారాలతో పుస్తక రూపంలో పత్రిక విలేఖరుల సమక్షంలో బహిర్గతం చేశారు.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో నాకు బైబిలు, ఖురాను, భగవద్గీత అని చెప్పి అటు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మరియు అదే విధంగా పత్తికొండ నియోజకవర్గ స్థాయిలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. అధికారులకు ఒక చోటు నుండి మరొక చోటికి ట్రాన్స్ఫర్అనేది సర్వసాధారణం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి MLA, మంత్రులకు ఒక చోటు నుండి మరో చోటుకు ట్రాన్స్ఫర్ చేయడం రాజకీయ చరిత్రలో మొదటి సారని ఎద్దేవా చేశారు. ఒక ఇంటి ముందు చెత్త వేరొక ఇంటి ముందు వేస్తే అది బంగారం అవుతుందా అని ఎద్దేవా చేశారు. మార్చాల్సింది MLA, మంత్రులను కాదని ప్రజలు వైసిపి ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేవలం 90 రోజుల్లో రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయదుందుభి మోగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివరెడ్డి, మనోహర్ చౌదరి రామానాయుడు తిరుపాలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకటరాముడు, మాజీ జెడ్పిటిసి పి. శ్రీనివాసులు, సింగం శ్రీనివాసులు, శ్రీనివాసులు గౌడ్, శ్రీధర్ రెడ్డి, సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.