సంక్రాంతి రోజుల్లో సాంప్రదాయ క్రీడలకు అనుమతి ఇవ్వాలి..
1 min readఎక్కడ కోడిపందెం, పేకాట, గుండాట నిషేధం, పటిష్టమైన బందోబస్తు
ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు
డివిజన్, మండల స్థాయి అధికారులతో ఆర్డిఓ కె ఖాజావలి వీడియో కాన్ఫరెన్స్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖజావలి అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం కోడె పందెములు, జూదం, గుండాట నియంత్రణపై ఏలూరు డివిజన్లలోని డివిజినల్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఖాజావలి మాట్లాడుతూ గ్రామాలలో ఎక్కడా కోడి పందెములు, జూదం, గుండాటలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం మండల స్థాయి నిఘా బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోడి పందెములు, జూదం, గుండాట లపై నిషేధ ఆజ్ఞలు అమలు లో ఉన్నాయని, సదరు ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై, సహకరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోడి పందెములు, జూదం, గుండాట లపై నిషేధ ఆజ్ఞలు అమలు లో ఉన్నాయని, సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడలు జరుపుకునేలా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ఎక్కడైనా కోడి పందెములు, జూదం, గుండాట లకు పాల్పడు వ్యక్తులు గురించి మరియు ప్రదేశముల గురించి సమాచారము తెలిసిన వెంటనే వాడు సంబంధిత తహసిల్దార్ వారికి లేదా స్టేషన్ హౌస్ ఆఫీసర్కి లేదా గ్రామ రెవిన్యూ ఆఫీసర్ కి లేదా పంచాయతీ కార్యదర్శి కి తెలియజేయాలని, సమాచారం తెలిపిన వారి వివరములు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. సమావేశంలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నెహ్రూబాబు, ఏలూరు, నూజివీడు డిఎస్పీ లు శ్రీనివాసరావు, అశోక్ కుమార్ గౌడ్, తహసీల్దార్ లు, పోలీసు సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.