NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీబీఐ విచార‌ణ‌.. ఎర్ర గంగిరెడ్డిని ఏడు గంట‌ల పాటు ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ వేగ‌వంతంగా జ‌రుగుతోంది. దాదాపు 10 రోజుల‌కు పైగా సీబీఐ క‌డ‌ప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో మ‌కాం వేసి విచార‌ణ చేప‌ట్టింది. అనుమానితుల్ని, వివేకా స‌న్నిహితుల్ని విచారించి ప‌లు కీల‌క విష‌యాలు నోట్ చేసుకుంది. అయితే.. ఎర్ర గంగి రెడ్డిని సీబీఐ అధికారులు మూడు రోజుల నుంచి వ‌రుస‌గా విచారిస్తున్నారు. శ‌నివారం కూడ ఎర్ర గంగిరెడ్డిన 7 గంట‌ల పాటు ఏక‌ధాటిగా విచారించారు. ఎర్రగంగిరెడ్డి నుంచి ప‌లు కీల‌క విష‌యాలు సేక‌రించిన‌ట్టు స‌మాచారం. ఇప్పటికే కేసు విచార‌ణ ప్రారంభ‌మై.. 13 రోజుల‌వుతోంది. ఈ నేప‌థ్యంలో చాలా విష‌యాల్ని సిబిఐ అధికారులు సేక‌రించిన‌ట్టు తెలుస్తోంది.

About Author