గర్భిణులు బాలింతల్లో రక్తహీనత రాకుండా చూడండి
1 min readడాక్టర్ మహమ్మద్ ఫిరోజ్..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : బాలింతల్లో గర్భిణుల్లో వచ్చే రక్తహీనతను రాకుండా ఆశావర్కర్లు చూడాలని గురువారం నాడు మండల ప్రభుత్వ వైద్యశాలలో ఆశా వర్కర్లకు ఏఎన్ఎం లకు సమ దుస్తులను పంపిణీ చేసిన మండల ప్రభుత్వ వైద్యుడు కే మహమ్మద్ ఫిరోజ్ ఆదేశించారు అనంతరం సి హె చ్. సీ సిబ్బంది ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి గ్రామాలలో రక్త హీనతతో బాధపడుతున్న మహిళలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్ లు హెల్త్ సూపర్వైజర్ మహేశ్వర్ రెడ్డి . ఆశా వర్కర్లు పాల్గొన్నారు.