అభివృద్ధి..సంక్షేమమే… సీఎం ధ్యేయం..
1 min readఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి
మంత్రాలయం, పల్లెవెలుగు: రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయంగా పాలన ఉందని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో టిటిడి పాలకమండలి సభ్యులు వై సీతారామిరెడ్డి తో కలిసి పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక భాగంలో రూ 40 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ వార్డు సచివాలయ భవనం ను, సంత మార్కెట్ లో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనంను ప్రారంభించారు. అనంతరం సంత మార్కెట్ లో నిర్వహించిన వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్ని పెన్షన్ పెంపు కు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అర్హతనే ప్రామాణికంగా పెన్షన్ లు మంజూరు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి వివరించారు. కొంత మంది లబ్ధిదారులకు పెన్షన్ లు పంపిణీ చేశారు. అంతకు ముందు వీరికి చెట్నేహళ్లి గ్రామానికి చెందిన సచివాలయ నిర్మాణం కాంట్రాక్టర్ లక్ష్మన్న, మంత్రాలయం కు చెందిన హెల్త్ క్లినిక్ భవన నిర్మాణం కాంట్రాక్టర్ జిమ్మి గజమాల వేసి శాలువ కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు జి. భీమారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, వైస్ ఎంపీపీ పులుకుకు రాఘవేంద్ర, ఎంపిడిఓ మణిమంజరి, తహసీల్దార్ చంద్ర శేఖర్, పంచాయతీ రాజ్ ఏఈ నర్సింహులు, ఈవోపీఆర్డి ప్రభావతి, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు వేణుగోపాల్ రాజు, కిరణ్, ఏపీఎం జయశ్రీ, ఏపీవో తిమ్మారెడ్డి, ట్రాన్స్ కో ఏఈ గోవిందు, పీఆర్ డిఈ అశ్వ ధామ, హౌసింగ్ డీఈ లాల్ క్రిష్ణయ్య, ఏఈ నాగసుబ్బయ్య, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, సచివాలయ మండల కో కన్వీనర్ వీకేసి రాఘవేంద్ర ఆచారి, చెట్నేహళ్లి సర్పంచ్ అంజిని, ఉప సర్పంచ్ వీరనాగప్ప, ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి, రామాంజనేయులు, నాయకులు రోగప్ప, రవి రెడ్డి, అధికారులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.