PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేఫ్​ కస్టడీ ఆర్టికల్స్​ను..డిస్పోజ్​ చేయండి

1 min read

 జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

కర్నూలు, పల్లెవెలుగు:  కర్నూలు కలెక్టరేట్ లోని ఖజానా శాఖ స్ట్రాంగ్ రూమ్ లో మూడు సంవత్సరాలకు పైగా భద్రపరిచిన వస్తువులు (సేఫ్ కస్టడీ ఆర్టికల్స్) ను త్వరితగతిన డిస్పోజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ లో జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్‌లలో మూడు సంవత్సరాలకు పైగా భద్రపరిచిన వస్తువులు (సేఫ్ కస్టడీ ఆర్టికల్స్) పై జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్‌లలో మూడు సంవత్సరాలకు పైగా భద్రపరిచిన వస్తువులను (సేఫ్ కస్టడీ ఆర్టికల్స్) డిస్పోజ్ చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ నెం.135 మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. సదరు ఆదేశాల మేరకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో జాయింట్ కలెక్టర్ ఛైర్మన్ గా, డిఆర్ఓ, అదనపు ఎస్పీ, జిల్లా పరిషత్ సీఈఓ, డిపిఓ, డిఈఓ, దేవాదాయ డిప్యూటీ/జాయింట్ కమీషనర్, జిల్లా సెషన్స్ కోర్టు ఏఓ, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా ఖజానా అధికారి (కన్వీనర్/మెంబర్) సభ్యులుగా ఉంటారన్నారు. ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ లో మూడు సంవత్సరాలకు పైబడిన పరీక్షాపత్రాలు, దేవాదాయ శాఖకు చెందిన వస్తువులు, బ్యాలెట్ పేపర్లు, ఖజానా శాఖకు చెందిన చెక్ బుక్ లు తదితర వాటిని భద్రపరచడం జరుగుతుందన్నారు. అందులో మూడు సంవత్సరాలకు పైబడి ఉన్న వాటిని ఎస్టీఓలు జాబితాను సిద్ధం చేయడం జరిగిందని అందులో రెవెన్యూకు సంబంధించి డిఆర్ఓ, ఏసిబి కు సంబంధించి అదనపు ఎస్పీ, ఖజానా శాఖకు సంబంధించి ఉన్న వాటిని ఖజానా శాఖ అధికారి సమన్వయం చేసుకుంటూ వాటిని డిస్పోజ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకుగాను మొదటి సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరిగిందని, రెండవ సమావేశం జనవరి 10వ తేదిన నిర్వహించుకొని, జనవరి 12వ తేదిలోపు ఉత్తర్వులు మంజూరు చేసి జనవరి 21వ తేదిలోపు సదరు ఉత్తర్వులు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్ లోని స్ట్రాంగ్ రూమ్ ను కమిటీ సభ్యులతో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో అదనపు ఎస్పీ టి.సర్కార్, డిఆర్ఓ మధుసూదన్ రావు, ట్రెజరీ డిడి రామచంద్రరావు, ఏటిఓ జయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు, జిల్లా రిజిస్ట్రార్ సిహెచ్. నాగలింగేశ్వరరావు, ఉపాధి కల్పన అధికారి దీప్తి, డిఈఓ రంగారెడ్డి, ఎస్టిఓ కరుణాకర్, ఎస్టిఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

About Author