బాధ్యతతో పనిచేస్తున్న ఏకైక ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ
1 min readఏపీ రైతు సంఘం అధ్యక్షులు పి రామచంద్రయ్య స్పష్టం
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సామాజిక స్పృహ కలిగి బాధ్యతతో పనిచేస్తున్న ఏకైక ఉపాధ్యాయ సంఘం ఎస్ టి యు అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య స్పష్టం చేశారు. శుక్రవారం పత్తికొండలోని స్థానిక చదువుల రామయ్య భవనంలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు పి. రామచంద్రయ్యచే యస్.టి. యు -2024 నూతన క్యాలెండర్ మరియు డైరీ ని ఆవిష్కరింపజేసారు. యస్.టి. యు.మండల అధ్యక్షుడు చంద్ర శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పి.రామచంద్రయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (యస్.టి.యు) నకు సామాజిక బాధ్యత ఎక్కువ ఉందని,ఈ సంఘం ప్రగతి శీల భావాలతో నడుస్తూ, సమ సమాజ నిర్మాణానికి పాటుపడాలని కోరారు. ఎస్ టి యు ఎప్పటికప్పుడు విద్యా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమానికి కృషి చేస్తూ,హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే ఉపాధ్యాయులు తమ గురుతర బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.అనేక మంది త్యాగాలతో ఆవిర్భవించిన ఉపాధ్యాయ సంఘం ఎస్ టి యు అని అన్నారు.వారి ఆశయాలను,ఆదర్శాలను నేటి ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం కావాలని ఆకాంక్షించారు. సామాజిక మార్పులో కీలక పాత్ర ఉపాధ్యాయులదే అని అన్నారు.ఇలాంటి మార్పు కోసం యస్.టి. యు.ముందు ఉండి పోరాడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్లు నారాయణ, సత్యనారాయణ,మండల అధ్యక్షుడు చంద్ర శేఖర్, ప్రధాన కార్యదర్శి బలరాముడు, ఆర్థిక కార్యదర్శి మారుతి,రాజ సాహెబ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.