జీడిపప్పు, బాదం ప్రకటన మాటున.. సైబర్ వల !
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ప్రజల్లో ఇమ్యునిటీని పెంచుకోవడం పట్ల శ్రద్ధ పెరిగింది. డ్రై ఫ్రూట్స్, నట్స్ వాడకం పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా డ్రై ఫ్రూట్స్ వ్యాపారం జరిగింది. ఇదే అదునుగా మార్చుకున్నారు సైబర్ నేరగాళ్లు. సగం ధరకే జీడిపప్పు… బాదం.. వాల్ నట్స్ అంటూ ఫేస్ బుక్ ప్రకటనలు గుప్పిస్తున్నారు.
– మొత్తం బాక్స్ ధర 2 వేలు అయితే.. సగం ముందుగా చెల్లించి.. మిగతా సగం డెలివరీ తర్వాత చెల్లించమని చెబుతున్నారు. దీంతో జనం సగం చెల్లించి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడెప్పుడు ఇంటికొస్తాయా ? అని ఎదురుచూస్తున్నారు. ఆ డ్రై ఫ్రూట్స్ ఇంటికి రావు.. సగం డబ్బు పోయినట్టే అని తెలుసుకున్నాక మోసపోయామని బాధపడుతున్నారు. హోం డెలివరీ ఇచ్చేక పూర్తీ డబ్బు చెల్లిస్తామని వినియోగదారులు చెబితే.. ఇలాంటి మోసాలకు అవకాశం ఉండదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. తక్కువకే వస్తున్నాయని ఆశపడి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని హెచ్చరిస్తున్నారు.
- డ్రై ఫ్రూట్స్ చాలా వరకు విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి చేసుకుంటారు. అందుకే ధరలు అధికంగా ఉంటాయి. మరి అలాంటి దిగుమతి చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వెయ్యి, రెండు వేలకు ఎలా అమ్ముతారన్న కనీస పరిజ్ఞానం వినియోగదారులు పెంచుకోవాలి. లేదంటే సైబర్ వలలో పడక తప్పదు.