PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  గత 11 రోజుల నుండి  నిరవధికంగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని అందుకు  నిరసనగా  శుక్రవారం మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదగా పటేల్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి పటేల్ సెంటర్ లో రాష్ట్ర రాస్తారోకో  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే. గోవిందు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి వై. నరసింహులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఎన్నికల ముందు కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తానని మాట ఇచ్చినేడు మాట తప్పారని ఆరోపించారు .కరోనా కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న మున్సిపల్ కార్మికులు దేవుళ్ళుగా భావించిన నాయకులు నేడు వారి సమస్యలు పరిష్కరించక పోవడం  దురదృష్టకరమన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల పట్టణ ప్రాంతాలలో మురికి ముద్ద చెత్తాచెదారం పేరుకుపోయి దోమలకు నిలయంగా మారి ప్రజలు అంటు రోగాల బారిన  పడిన పరిస్థితి నేడు కనపడుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన ప్రభుత్వం నేడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలైన కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల ను రెగ్యులర్ చేసి వారికి నెలకు రూ. 26 వేల  ఇవ్వాలని .ఆప్కాస్ లో పనిచేస్తున్న 90 వేల మంది కార్మికులను రెగ్యులర్ చేయాలని , కార్మికుడు చనిపోతే వారి కుటుంబంలో ఒక్కొరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనాకాలంలో మరణించిన ప్రతి కార్మికుడికి  రూ. 50 లక్షల  ఎక్స్గ్రేషియా చెల్లించాలని తదితర న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేసి ప్రజలు రోగాల బారిన  పడకుండా కాపాడాలని  ప్రభుత్వాన్ని కోరారు .అదేవిధంగా లారీ, ఆటో .ఇతర వాహనాల డ్రైవర్స్ కు ప్రమాదకరంగా మారే ఇండియన్ జ్యుడీషియన్ కోడ్ 106/2   ను కేంద్ర ప్రభుత్వం  వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఆర్. శేఖర్, ఐఎఫ్ టి యు డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ ,సత్యరాజు ,మా భాష. సుందర్ రాజు, మద్దిలేటి ,శంకర్ ,మల్లి తదితర మున్సిపల్ ఆటో కార్మికులు పాల్గొన్నారు.

About Author