ఇంటి ముంగిటిలోనే వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజల ఇంటి ముంగిటిలోనే వైద్య సేవలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని బిజినవేముల గ్రామ సర్పంచి , నందికొట్కూరు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు రవి యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బిజినవేముల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచి రవి యాదవ్ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు ఉన్నవారిని వైద్య శిబిరాలకు తీసుకురావడం, ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జగనన్న పెట్టిన ఈ అవకాశాన్ని బిజినవేముల గ్రామ ప్రజలు సాధ్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ మురళి క్రిష్ణా రెడ్డి , ఎంపీడీఓ శోభారాణి ,వైస్ ఎంపీపీ పబ్బతి జ్యోతి రవి కుమార్ , మహమ్మద్ రఫీ, శ్రీనివాసులు, శివలింగం, నాగరాజు, వెంకటేశ్వర్లు, బాలీశ్వరయ్య, వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.