ఇరాన్ దేశ అధ్యక్ష ఎన్నికలు.. రాజమండ్రిలో పోలింగ్
1 min readపల్లెవెలుగు వెబ్: ఇరాన్ దేశ అధ్యక్ష ఎన్నికలకు రాజమండ్రిలో పోలింగ్ పెట్టడమేంటని అనుకుంటున్నారా?. అవును. ఇరాన్ దేశ అధ్యక్ష ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే.. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చాలా మంది ఇరాన్ దేశస్థులు.. వ్యాపారం, చదువు నిమిత్తం నివాసం ఉంటున్నారు. రాజమండ్రిలోనే కాకా.. హైదరాబాద్, బెంగళూరులో కూడ పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. దేశ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు భారత్ లో ఉన్న ఇరాన్ దేశస్థులకు .. ఆ దేశం అవకాశం కల్పించింది. రాజమండ్రిలో దాదాపు 28 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రంతో పాటు… పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా రాజమండ్రి పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. తమ దేశ ఎన్నికలకు .. ఇండియా నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందంగా ఉందని ఇరాన్ ఓటర్లు తెలిపారు.