PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ్యోతి రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

1 min read

ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని పిలుపు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : పెదవేగి మండలం, వంగూరు, లక్ష్మీపురం గ్రామంలో జనవరి 7 ఆదివారం రోజున జ్యోతి రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం  ఏర్పాటు చేశామని పాస్టర్ జ్యోతి రాజు తెలిపారు. వంగూరు, లక్ష్మీపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, డెంగ్యూ, డిపి, షుగర్, థైరాడ్, విష జ్వరాలు, కీళ్లవాతలు, కీళ్ల నొప్పులు, ఉబ్బసం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. అన్ని రకాల రక్త పరీక్షలు కూడా ఉచితంగా చేసి మందులు కూడా ఇవ్వబడునని తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో నిష్ణాతులైన వైద్య బృందంతో జరుపబడని అన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్య సలహాలు కూడా ఇవ్వబడతాయన్నారు. దీనిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

About Author