వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలి
1 min readజిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాల్లో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి పాల్గొననున్న సందర్భంగా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాలో నాలుగు చోట్ల వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు కర్నూల్ రూరల్ మండలం గార్గేయపురం లోను, పదవ తేదీన ఉదయం నందవరం మండల కేంద్రంలోనూ, మధ్యాహ్నం హోళగుంద మండలం గజ్జేహళ్లి లోను, 11వ తేదీన తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. కేంద్ర మంత్రి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రదర్శిస్తూ స్టాళ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉజ్వల, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్మాన్ భారత్, జన ఔషధి,సాయిల్ హెల్త్ కార్డ్స్, పీఎం కిసాన్, పీఎం పోషణ్ అభియాన్, పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, స్వమిత్వ, జీవనజ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలను స్టాళ్లలో వివరించే విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులను సమావేశాలకు తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. జడ్పీ సీఈవో ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్స్ గా ఉన్నందున ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు..అలాగే సంబంధిత ఎంపీడీవో, తహసిల్దారు వేదిక, ఇతర ఏర్పాట్లను చూసుకోవాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారము సమావేశాలను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పి సీఈవో నాసర రెడ్డి, ఆర్డీవో హరి ప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ ఈ సుబ్రహ్మణ్యం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, డి ఎం హెచ్ ఓ రామ గిడ్డయ్య, హౌసింగ్ పిడి సిద్ధ లింగమూర్తి, ఐసిడిఎస్ పిడి వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.