జిల్లాలో కరువలకు రాజకీయ పార్టీలు ఎంపీ,ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి
1 min readఘనంగా జిల్లా కురువ,మదాసి,మదారి కురువ సంఘాల జేఏసీ ఏర్పాటు.
జేఏసీ కన్వీనర్ గా కురువ రవికుమార్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : నగరంలోని స్థానిక సంతోష్ నగర్ లో ప్రైవేటు ఫామ్ హౌస్ లో జరిగిన కురువ మదాసి మదారి కురువ సంఘాల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ లక్ష్మీ ప్రసాద్,పంచలింగాల నాగరాజు,మాన్వీ దేవేంద్రప్ప, అంగడి జయరామ్, మోహన్ ప్రసాద్ కర్నూలు జిల్లాలో ఉన్న పద్నాలుగు కురువ మదాసి మదారి కురువ సంఘాల ప్రతినిధులు హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా కురువ మదాసి మదారి కురువ సంఘాల రాజకీయ అవకాశాలు కోసం అన్ని కురువకుల సంఘాలు జేఏసీ గా ఏర్పాటు కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో కురువ మదాసి మదారి కురువ సంఘాల రాజకీయ జేఏసీ ప్రజాస్వామ్య పద్దతిలో ఓటింగ్ ద్వారా జేఏసీ కన్వీనర్ గా రాయలసీమ కురువ రవికుమార్ ను కో కన్వీనర్లుగా తవుడు శ్రీనివాసులు,శ్రీనివాసరావు,కురువ బలరాం, కురువ మహేంద్ర, సీజీ శివయ్య,మదాసి మదారి కురువ సంఘాల నాయకులు మదాసి కురువ సుంకన్న,మదాసి కురువ శివలింగం, తిరుమలేష్, బసవరాజు,బత్తిన కిరణ్ కుమార్,కురువ జోషి,కురువ నాగేష్,కురువ పురుషోత్తం లు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని కురువ సంఘాలన్ని ఒకే వేదికగా కురువ మదాసి మదారి కురువ రాజకీయ జేఏసీ ఏర్పాటు ద్వారా జిల్లాలో అన్ని పార్టీలలో ఉన్న కురువ సామాజిక వర్గానికి చెందిన ఆశావాహులకు ఎమ్మెల్యే,ఎంపీ స్థానాలకు ఇస్తే కురువలు ఐకమత్యంతో గెలిపించుకుంటామని రాజకీయ అవకాశాలు ఇవ్వని పార్టీలను ఓడిస్తామని వారు హెచ్చరించారు కర్నూలు జిల్లాలో ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న కురువ సామాజిక వర్గానికి పార్టీలు రాజకీయ అవకాశాలు కల్పించకపోగా కేవలం ఓటు బ్యాంకుగా కురువలను వాడుకుంటున్నాయని రాబోయే ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి కొనసాగితే కురువలంతా ఏకమై కురువ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వని రాజకీయ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓటింగ్ ద్వారా కురువ సంఘాల రాజకీయ జేఏసీ కన్వీనర్ గా ఎన్నికైన రాయలసీమ కురువ రవికుమార్ కు నాయకులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కురువ రంగస్వామి,కేసీ నాగన్న,రామ్ మోహన్, రంగస్వామి,భరత్,మల్లప్ప,శివ శంకర్, కురువ రాజు, శివప్రసాద్,కోటిలింగ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.