బోఫ్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఏలూరు జిల్లా చెస్ ఫెస్టివల్..
1 min readచదరంగం భారతదేశంలో రూపుదిద్దుకున్న ప్రముఖ ఆట..
బోఫ్ జాతీయ అధ్యక్షులు డా: దేవరకొండ వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బోఫ్) తరుపున ఆదివారం ఏలూరు జిల్లా స్థాయి చెస్ ఫెస్టివల్ నిర్వహించబడింది. ఈ ఫెస్టివల్ను ఏలూరు ఒంటౌన్లోని అక్షర స్కూల్లో అండర్ 11 & 18 కోటాలో నిర్వహించారు. అర్బిటర్గా ప్రముఖ చెస్ కోచ్ యోహనన్ వ్యవహరించారు. చెస్ ఫెస్టివల్ని అక్షర హైస్కూల్ ప్రిన్సిపాల్ రజనీ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన బోఫ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చదరంగం భారత దేశంలో రూపుదిద్దుకున్న ఆటని అన్నారు.16 వ శతాబ్దం నుంచి క్రమబద్ధమైన చెస్ టోర్నమెంట్ లు భారతదేశంలో నిర్వహించబడుతున్నాయని అన్నారు.నేడు ప్రపంచ్యాప్తంగా 61 కోట్ల మంది ప్రతి రోజు చెస్ ఆడుతున్నారని చెప్పారు.ఇది మేథోపరమైన ఆటని, ఐక్యూ ని బాగా పెంచుకోవచ్చని, ఒక చిన్న అకాడమీ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి ఛాంపియన్ వరకు ఎదగవచ్చని వెంకటేశ్వర్లు వివరించారు.ఆర్థికంగా కూడా ఈ ఆట ద్వారా స్తితిమంతులు కావడంతో పాటు పేరు – ప్రఖ్యాతులు , కీర్తి – ప్రతిష్ఠలు సాధించవచ్చన్నారు.బహుజన అధికారులు మరియు ఉద్యోగుల సమాఖ్య ద్వారా త్వరలో చెస్ ప్లేయర్స్ అండ్ పేరెంట్స్ వింగ్ ప్రారింబిస్తున్నామన్నారు.ఆసక్తి కలిగినవారు ఫోన్ నెంబర్ 94405 39808 ద్వారా సంప్రదించవచ్చుని తెలిపారు. నెలకు రెండు టోర్నమెంట్స్ చొప్పున జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ నిర్వహించడంతో పాటు ఛాంపియన్ కోచ్స్ చే ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.ఆటలో పరిణితి సాధించిన చిన్నారులకు క్యాష్ ప్రైజ్లతో పాటు మెడల్స్ , మేమెంటోస్,మెరిట్ / ప్రశంసా పత్రాలను బహూకరించారు. విజేతలు.జి.అనురూప్ మోషే .(ప్రథమ)జి.అభిషెక్ అవ్రహ మ్ (ద్వితీయ)ఎమ్.విక్రాంత్ (త్రృతీయ) మెరిట్ -స్టీఫెన్,మరియ బాలాజీ, సాత్విక్, రోహిత్,మరియ రాజు,నందన,నిత్య, సోనాక్షి, రక్షిత.లోహిత్ బహుమతులు సాధించారు.