PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా.చంద్రశేఖర్​ సేవలు.. ఎనలేనివి..

1 min read

డా. శంకర్​ శర్మ, డా. భవాని ప్రసాద్​

  • జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య శిబిరం

కర్నూలు, పల్లెవెలుగు:సంపాదనలో కొంతైనా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని, అందుకు నిదర్శనం ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​ ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసించారు డా. శంకర్​. డా. భవాని ప్రసాద్​.  ఆదివారం కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ కార్యాలయ ఆవరణలో జర్నలిస్టులకు గుండె సమస్యలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు బీపీ, షుగర్​, ఈసీజీ, 2డికే, లివర్​ సమస్యలపై పరీక్షలు, తదితర విలువైన వైద్య చికిత్సలు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డా. శంకర్​ శర్మ, డా. భవాని ప్రసాద్​ మాట్లాడుతూ వైద్యరంగంలో డా. చంద్రశేఖర్​ చేసిన సేవలు అద్భుతమన్నారు. కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు వివిధ వ్యాధులపై సంబంధిత వైద్యులతో అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో డా. చంద్రశేఖర్​ ముందుండటం సంతోషకరమన్నారు. ప్రతిఒక్కరూ తాము ఎంచుకున్న… రాణిస్తున్న రంగంలో సమాజ శ్రేయస్సు కోసం సేవలు అందించాలని ఈ సందర్భంగా డా. శంకర్​ శర్మ, డా. భవాని ప్రసాద్​ కోరారు. కార్యక్రమంలో సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్​ విజయమ్మ, డా.మహేష్​ తదితరులు పాల్గొన్నారు.

About Author