మద్దిగుండం చెరువు రైతులకు న్యాయం చేయండి
1 min read-కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా..కలెక్టర్ కు వినతి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామ సమీపంలో ఉన్న మద్ది గుండం చెరువు రైతులకు వెంటనే న్యాయం చేయాలని నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆయా గ్రామాల ప్రజలు ధర్నా చేపట్టారు. సుంకేసుల,చింతలపల్లె,కాజీ పేట గ్రామాలకు సంబంధించి కొంత మంది పెద్ద పెద్ద నాయకులు రైతులు మోటార్లు ఇంజన్లు బావులు ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తున్నారని మద్దిగుండం చెరువు దురాక్రమణకు గురవుతుందని ఆయకట్టు 2,800 ఎకరాలు పొలం అన్యా క్రాంతం అవుతుందని రైతులు తెలిపారు.గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేపట్టారు.ఇరిగేషన్ చిన్న నీటి పారుదల శాఖ ఈఈ మరియు డిఈ బయటికి వచ్చి వారు రైతులతో మాట్లాడారు. అనంతరం స్పందనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ కు రైతులు వినతిపత్రం అందజేశారు. కొందరు నాయకులు అక్రమంగా నీటిని తరలిస్తున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అదే విధంగా ఆయకట్టుదారు రైతులు లక్షల రూపాయలు వెచ్చించారని గత ఎనిమిది సంవత్సరాల నుండి సమస్య పరిష్కారం కావడం లేదని పంటలు దెబ్బతింటూ ఉన్నాయని కలెక్టర్కు వివరించినట్లు రైతులు తెలిపారు.జిల్లా కలెక్టర్ మరియు అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తామని అన్నారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హరి సర్వోత్తమ్ రెడ్డి,రామలింగారెడ్డి,కాత మనోహర్ రెడ్డి,కమ్మ పెద్ద మద్దిలేటి,పుల్లయ్య,అబ్దుల్ గని,తిరుపాల్ రెడ్డి,గుండం కృష్ణారెడ్డి,సంజీవరెడ్డి,నిరంజన్ భాష,వడ్డే శ్రీనివాసులు,వడ్డే ఎల్లనాగన్న,సంజన్న మరియు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.