మాపై ఏ స్మా ప్రయోగిస్తే చూస్తూ ఊరుకోము.. జీఓ నెంబర్ 2 రద్దు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండలంలో అంగన్వాడీలు సమ్మె 28వ రోజులు కొనసాగుతున్నది. అంగన్వాడీలు పై ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న, ఎంత భయపెట్టించిన ,వెనక తిరిగి చూడకుండా పట్టుదలతో సమ్మె కొనసాగిస్తాం ,ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. ప్రభుత్వము అంగన్వాడీలతో మూడుసార్లు చర్చలు జరిపినప్పుడు గుర్తుకు రానిది ఇ ప్పుడు అంగన్వాడీల సేవ అత్యవసరమైనదని ఎస్మా చట్టం ప్రయోగించినది. 26 రోజులు వరకు అంగన్వాడి సేవ అత్యవసరమైనదని తెలుసుకోకుండా మంత్రివర్గంలో కొనసాగడానికి అర్హత లేదని వారు అన్నారు. అంగన్వాడీలకు ఎస్మా చట్టం వర్తించదు .అంగన్వాడీలకు లేనిపోని భయాలు సృష్టించి, భయపెట్టించి సమ్మె విరమింప చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకు అంగన్వాడీలపై అస్మా తీసుకొస్తే నీ ముఖ్యమంత్రి సీటు కదిలించడానికి మేము వెనకాడ బోమని వారు అన్నారు.రాష్ట్రంలో అంగన్వాడీలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు . బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో చట్టాలు, న్యాయము ,రక్షణ అన్ని అంశాలపై క్షుణ్ణంగా ఆలోచించి గ్రంథము రాసినారు. ఆ చట్టాలు ,ఆ సెక్షన్లు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, అధికారులకు తెలియడం లేదు .అందుకు మీరైనా అంగన్వాడీలకు ఎస్మా చట్టం వర్తించదని చెప్పి,జీవో 2 ను రద్దుచేసి అంగన్వాడీలకు న్యాయం చేయాలని ,మేము మీకు మెమో రాండం ఇస్తున్నాం.అంతకుముందు శిబిరం నుంచి ర్యాలీగా బయలుదేరి నినాదాలతో పోరెత్తించి అంబేద్కర్ విగ్రహం చేరి అంబేద్కర్ కి మెమో రాండం ఇవ్వడమైనది. ర్యాలీలో కార్యక్రమంలో రోజుమేరీ, శోభ, మీనాక్షి, రాధా చాముండి, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.