ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి..
1 min readఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: 28 రోజులుగా అంగన్వాడి కార్మికులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కుటుంబాలను వదిలి శాంతియుత ఆందోళన కొనసాగిస్తుంటే వేతనాలు పెంచాల్సిన ముఖ్యమంత్రి మహిళా కార్మికులపై దౌర్జన్యం చేసే విధంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం సిగ్గుచేటు అయిన విషయమని ఇలాంటి జిఓ ల వల్ల ఉద్యమాల ఆపే ప్రసక్తి లేదని ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచి మహిళా కార్మికులకు న్యాయం చేయాలని అంగన్వాడి మండల నాయకురాలు రాములమ్మ డిమాండ్ చేశారు.. సోమవారం గడివేముల తాసిల్దార్ కార్యాలయం ఎదుట 28వ రోజు సమ్మెలో భాగంగా సీఎం డౌన్ డౌన్ అంటూ సమ్మె మా హక్కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాములమ్మ వసంతలక్ష్మి రామ్ చెన్నమ్మ పాల్గొన్నారు.