సత్రంపాడు వెలుగు ఆఫీస్ లో మినీ జాబ్ ఫెయిర్ నిర్వహణ
1 min read– 18-35 వయసుగల వారు అర్హులు
– టెన్త్ నుండి పీజీ వరకు విద్యార్థి విద్యార్థులు హాజరు కావాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో వెలుగు ఆఫీస్, సత్రంపాడు నందు 11-01-2023 (గురువారం) మిని జాబ్ ఫెయర్ నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్ధ అధికారి గంటా సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మిని జాబ్ ఫెయిర్ నందు, హెట్రో లాబ్స్, ఇన్నోవసోర్స్, పే. టి.యం కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. అలాగే సుమారు 150 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ మిని జాబ్ మేళా కు 10వ తరగతి, ఇంటర్, ఐ.టి.ఐ, డిగ్రీ, పి.జి వంటి విద్యార్హతలు ఉండి 18-35 సంవత్సరాల వయసు గల వారు అర్హులని తెలియజేశారు. ఇతర వివరాలకు 8978524022, 8919608183 ను (9988853335 – టోల్ ఫ్రీ) ఈ జాబ్ మేళాకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ బయడేటా మరియు సర్టిఫికెట్స్ నకలు తో హాజరు కావాలని ఆయన తెలిపారు.