అక్రమ నిర్బంధం తగదు…యుటిఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు విడుదల చేయాలను కోరుతూ మంగళవారం యుటిఎఫ్ చేపట్టిన చలో విజయవాడను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా యుటిఎఫ్ జిల్లా నాయకులను కార్యకర్తలను ఎక్కడకక్కడ అక్రమ అరెస్టులు చేయడం పట్ల ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవికుమార్ నవీన్ పాటి ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థిక బకాయిలను చెల్లించకుండా అలసత్వం వహిస్తుందన్నారు. ఏపీ జి ఎల్ ఐ ,పిఎఫ్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వాటిని విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. విజయవాడలో చేపట్టిన 36 గంటల నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేతనైతే ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడలో చేపట్టిన నిరసన తెలియజేసేందుకు వెళ్లిన సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు కే సురేష్ కుమార్ జిల్లా నాయకులు నవీన్ పాటి యెహోషువ ల లో అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. కర్నూల్ నగరంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ను పోలీసుల గృహ నిర్బంధం చేశారు.