సొప్ప ట్రాక్టర్ పై పడిన విద్యుత్ స్తంబం
1 min read-విద్యుత్ తీగలు తగిలి కాలిపోయిన సావ హోళగుందలో ట్రాక్టర్లో కాలిపోతున్న సోవును ఆర్పెండుకు ప్రయత్నిస్తున్న స్థానికులు
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండల కేంద్రం హొళగుంద దిద్ది కాలనిలో మంగళవారం సోమతో వెళ్తున్న ట్రాక్టర్ పై విద్యుత్ స్తంబం పడి షార్ట్ నర్కుట్ జరిగి సోవు మొత్తం పూర్తిగ కాలిపోయింది. గ్రామానికి చెందిన రైతు కూడూరు రణాక్ జొన్న సొమును కొని ట్రాక్టరులో తరలిస్తుండగ దిడ్డి కాలనిలోని శీనప్ప బావి వద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంబం తగిలి ట్రాక్టరు పై ఒరిగిపోయింది. దీంతో విద్యుత్ తీగలు సావు పై వడి మంటలు వ్యాపించడంతో డ్రైవర్ ట్రాలీని అక్కడే వదిలేసి ఇంజన్తో ముందుకెళ్లాడు. అక్కడే ఉన్న స్థానికులు సాపుకు అంటుకున్న మంటలను ఆర్పారు. అయితే అంతలోపు సొప్పంతా కాలపోగ ట్రాలీ మాత్రం ప్రమాదానికి గురికాకుండ మిగిలింది. వర్షాబావం వల్ల పశువులకు గడ్డి దొరకని సమయంలో సొప్ప కాలిపోవడంతో రైతు ఆందోళన చెందాడు. దాదాపు రూ.50 వేలు నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. అదేవిధంగా కాలనిలోని రోడ్డు వెంబడి విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రమాదాలు జరగకుండ చర్యలు తీసుకోవాలని కాలని వాసులు కోరుతున్నారు.