నకిలీ విత్తనాల ముఠాపై చర్యలు తీసుకోవాలి
1 min read– సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి
పల్లెవెలుగు వెబ్, ఆస్పరి: నకిలీ విత్తనాలను తయారు చేసే ముఠాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి ,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు డిమాండ్ చేశారు. ఆస్పరి సిపిఐ వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నకిలీ విత్తనాలు తయారు చేసే ముఠాలు ఎక్కువయ్యావని, దేశానికి అన్నం పెట్టే రైతన్నను మోసం చేసే దుస్థితి మనదేశంలో ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు విక్రయదారులు, తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని కోరారు. అలాగే 2017, 2018 ,19 పెండింగ్లో ఉన్న పంట నష్టపరిహారం సకాలంలో ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, కల్లుకుంట, ఇస్మాయిల్, సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.