PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆడుదాం ఆంధ్రా మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల జిల్లా పరిషత్ క్రీడా ప్రాంగణంలో బుధవారం నాడు ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి పోటీలు గడివేముల సర్పంచ్ రవణమ్మ .ఎంపీడీవో మల్లేశ్వరప్ప .ఎంపీటీసీ వంగాల మహేశ్వర్ రెడ్డి .ఉపసర్పంచ్ బాలచెన్ని . అట్టాసంగా క్రీడ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పోటీలను సద్వినియోగం  చేసుకుని క్రీడాకారులు జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు ఎంపిటిసి మాట్లాడుతూ ఎక్కడ మారుమూల పల్లెలో ఉన్న క్రీడాకారులను గుర్తించడానికి జగనన్న ఏర్పాటుచేసిన  ఆడుదాం ఆంధ్ర ఒక వేదికలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఉప సర్పంచ్ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపోటములు మామూలేనని ఘర్షణకు తావు లేకుండా క్రీడాకారులు మంచి క్రీడా స్ఫూర్తితో ఈ పోటీలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తారకేశ్వరి. రంగడు. షబానా. వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author