PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పల్లెవెలుగు’తోంది….!

1 min read

వాస్తవాలు రాసే ‘మీడియా’.. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలి

  • జివిఆర్​​ చిన్నపిల్లల ఆస్పత్రి ఎండి డా. భువనేశ్వరి

కర్నూలు, పల్లెవెలుగు: ప్రజాక్షేత్రంలో అవినీతిని ఎండగడుతూ…ఎప్పటికప్పుడు వార్తలు తెలియజేసే మీడియారంగం.. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని… మరింత  ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జీవీఆర్ చిన్నపిల్లల ఆస్పత్రి ఎండి. డాక్టర్​ భువనేశ్వరి.  స్థానిక ఎన్​ఆర్​పేటలోని జీవీఆర్​ చిన్న పిల్లల ఆస్పత్రిలో బుధవారం ‘పల్లెవెలుగు’ దినపత్రిక నూతన క్యాలెండర్​ 2024ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డా. భువనేశ్వరి మాట్లాడుతూ ప్రజలకు.. ప్రభుత్వానికి వారధిగా నిలిచిన మీడియా రంగం… తప్పులను నిర్భయంగా రాయాలని సూచించారు. నగరంలో కొన్నేళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. ఓ వైపు ఆస్పత్రిలో వైద్య సేవలు చేస్తూనే…మరో వైపు అనాథలకు పండ్లు, బ్రెడ్లు, దుప్పట్లు, దుస్తులు అందజేశామని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. 36 సంవత్సరాలుగా ఆస్పత్రిలో చిన్న పిల్లలకు ప్రత్యేక వైద్య సదుపాయలతోపాటు మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని ఈ సందర్భంగా జీవీఆర్ చిన్నపిల్లల ఆస్పత్రి ఎండి. డాక్టర్​ భువనేశ్వరి వెల్లడించారు.

About Author