టికెట్ రేసులో కొండేపోగు చిన్న సుంకన్న..?
1 min readబిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం.
బైరెడ్డి కుటుంబ సభ్యుల ఆశీస్సులతో టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.
అధిష్టానం నిర్ణయమే తరువాయి..?
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నందికొట్కూరు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన కొండేపోగు చిన్న సుంకన్న పోటీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నంద్యాల జిల్లా బిజెపి పార్టీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈయన ఎమ్మెల్యే అభ్యర్థితంపై బైరెడ్డి కుటుంబ సభ్యుల ఆశీస్సులు కూడా ఉండడంతో బిజెపి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈయనకు బిజెపి పార్టీలో మంచి గుర్తింపు ఉంది. బైరెడ్డి కుటుంబానికి నమ్మిన బంటు.బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి ప్రోత్సాహంతో బిజెపి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 2009 లో నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారిన తరువాత జరిగిన 2009 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా నందికొట్కూరు పట్టణానికి చెందిన కె. సాయి బాబాకు టికెట్ ఇచ్చింది. ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అనంతరం జరిగిన 2014, 2019 ఎన్నికలలో బిజెపి పార్టీ తరుపున నామినేషన్ వేయడానికి అభ్యర్థులు కరువైయారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణాలలో భాగంగా రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా పోటీచేస్తున్నాయి. జనసేన పార్టీ మొదటి నుంచి బిజెపి పార్టీతో కలిసి ఉంది.రానున్న 2024 ఎన్నికలలో మూడు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థులను నిలబెడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే నందికొట్కూరు లో బిజెపి చరిత్ర సృష్టిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపధ్యంలో 2024 నందికొట్కూరు బిజెపి అభ్యర్థిగా కొండెపోగు చిన్న సుంకన్న పేరు తెరపైకి రావడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.సుంకన్న రాజకీయ ప్రస్థానం..కొండే పోగు చిన్న సుంకన్న నంద్యాల జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి జననం 1984 మే 2 ముచ్చుమర్రి గ్రామంలో కొండే పోగు సాయమ్మ కొండే పోగు సుబ్బయ్య (దావీదు) దంపతులకు లకు జన్మించారు.వీరికి నలుగురు సంతానం కొండే పోగు సోల్మన్ , కొండేపోగు పెద్ద సుంకన్న కొండేపోగు సుమిత్ర , కొండేపోగు చిన్న సుంకన్న .సుంకన్న ఉన్నత చదువులు చదివారు.ప్రాథమిక విద్యాబాసం ముచ్చుమర్రి మండల పరిషత్ పాఠశాలలో 1వ తరగతి నుండి 4వతరగతి దాకా, 5వ తరగతి 6వతరగతి మిడుతూర్ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నందు ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు, 7వ తరగతి 8వతరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు నందికొట్కూరు పట్టణంలోని కోట హైస్కూల్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ నందు విద్యను అభ్యసించినాడు. మిడుతూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ లో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ 2000 సంవత్సరం నుండి 2002 దాకా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందికొట్కూరు , 2003 నుంచి 2006 దాకా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందికొట్కూరు , 2007 నుంచి 2008దాకా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో బ్యాచిలర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. 1998 నుండి 2006 ఏఐఎస్ఎఫ్ విద్యార్ధి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని నందికొట్కూరు పట్టణ కార్యదర్శిగా పనిచేశారు . అలాగే 2006 నుండి 2008 దాకా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2008 నుండి కేశవరెడ్డి విద్యాసంస్థలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ప్రస్తుతం కర్నూలు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2016 నుండి ఇప్పటిదాకా సి రాక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉన్నాడు 2020 నుంచి బిజేపి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్. బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరిన కొండే పోగు చిన్న సుంకన్న తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ నంద్యాల జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శిగా బిజేపి పార్టీలో చురుగ్గా ఉన్నారు. సామాన్య కార్యకర్తగా ఉంటూ ఎన్నో ఉద్యమాలు బిజెపి పార్టీ నుండి ధర్నాలు రాస్తారోకాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతూ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జిగా ప్రస్తుతం నంద్యాల జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో బిజేపి పార్టీ తరుపున నందికొట్కూరు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో బంధువు వర్గం , విద్యార్ధి సంఘాలలో పరిచయాలు మెండుగా ఉన్నాయి.అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.