ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 13 లక్షల, 85 వేల ఆర్థిక సహాయం చెక్కులను గురువారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆర్థర్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు నియోజకవర్గంలోని లబ్ధిదారులైన బ్రాహ్మణ కొట్కూరు కు చెందిన షేక్ హమీద్, మల్యాల కు చెందిన నక్కల నారాయణ, కొక్కెరంచకు చెందిన తెలుగు లక్ష్మీదేవి, ప్రాతకోటకు చెందిన అంబటి రామసుబ్బారెడ్డి, మద్దూరు కు చెందిన బోయ సరస్వతి, మండ్లెం గ్రామానికి చెందిన గొల్ల మద్దమ్మ, ఇస్కాల గ్రామానికి చెందిన మేకల శేషన్న శీలం మనోహర్ రెడ్డి, కొత్తపల్లెకు చెందిన గాయత్రి, పారుమంచాలకు చెందిన మాధవరం ప్రకాశం, ఎర్రమటం గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ లకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.