PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువలకు టికెట్లు ఇవ్వకపోతే మా సత్తా ఏంటో చూపిస్తాం

1 min read

కర్నూలు జిల్లా కురువ సంఘం..

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా లో కురువలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రదాన పార్టీలు మాకు సీట్లు ఇవ్వాలని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం కె రంగస్వామి శుక్రవారం ఆదోనిలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. జిల్లాలో ఐదు లక్షల ఓట్లు ఉన్నాయి.  అనాదిగా మాకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి  పార్టీలు మమ్మల్ని కించపరుస్తూ ప్రతి ఎన్నికల్లో తప్పకుండా సీట్లు  కేటాయిస్తామని చెప్పి ఇవ్వకుండా చేస్తున్నారు .2024 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించకపోతే జిల్లాలోని అన్ని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలబెడతామని వారు పేర్కొన్నారు. ఇప్పటికే పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు స్థానాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చినట్లు వారు తెలిపారు .మా అభ్యర్థులు లేని చోట నోటాకు  ఓటు వేస్తామని వారు తెలిపారు ,ప్రతి నియోజకవర్గంలో మేము 50 వెళ్లనుంది  నుండి 70 వేల వరకు ఉన్నామని గెలుపోటములను నిర్ణయించే సత్తా మాకు ఉందని వారు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో టిడిపి ,వైసిపి పార్టీ నుండి కురువ అభ్యర్థులు పోటీలో ఉంటామని ,ప్రధాన పార్టీల  అధ్యక్షుల చుట్టూ తిరుగుతున్న మా వారిని పట్టించుకోవట్లేదు చివరి వరకు చూసి తప్పకుండా ఎన్నికల్లో మా తడాఖా ఏందో చూపిస్తామని హెచ్చరించారు .ఈ సమావేశంలో  జిల్లా సహాయ కార్యదర్శి దేవేంద్ర, బి ఎన్ టాకీస్ వెంకటేష్ ,పకీరప్ప ,శివరాం, హనుమంతు ,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author