‘ఎయిడ్స్’ బాధితులకు..అల్పాహారం…
1 min readశ్రీ సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో అల్పాహారం.. పౌష్టిక ఆహారం కిట్ల పంపిణీ
- నిర్వాహకులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి, నాగరాజు యాదవ్‌ను మెచ్చుకున్న కలెక్టర్
- నాగరాజు యాదవ్‌ను సన్మానంచిన అధికార యంత్రాంగం
కర్నూలు, పల్లెవెలుగు: ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యమని… వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు కలెక్టర్ డా.జి.సృజన. శుక్రవారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హెచ్ ఐ వి బాధితులతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అల్పహార విందు లో పాల్గొన్నారు. వారితో కలిసి కలెక్టర్ సహ పంక్తిలో అల్పాహారం తీసుకోవడం విశేషం… ఈ కార్యక్రమం లో పాల్గొని ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష వద్దు అనే సందేశాన్ని సమాజానికి అందించారు. కాగా శ్రీ సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎయిడ్స్ బాధితులకు అల్పాహార విందు, పౌష్టిక ఆహార కిట్లను పంపిణీ చేశారు. అనంతరం శ్రీ సాయి ఆదరణ సేవా సమితి నిర్వాహకులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి, నాగరాజు యాదవ్ ను అధికార యంత్రాంగం అభినందించారు. ఆ తరువాత నాగరాజు యాదవ్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.