PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భవిష్య నిధి రుణాలు సరే.. మిగిలిన బకాయిలు ఎప్పుడు-యుటిఎఫ్

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ:   పెండింగ్ లో ఉన్న ఉద్యోగ,ఉపాధ్యాయుల 18 వేల కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 3 దశల పోరాటాల ఫలితంగా నిన్న కేవలం భవిష్య నిధి రుణాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని మిగిలిన ఏ పి జి ఎల్ ఐ,పి ఆర్ సి,డి ఏ,సంపాదిత సెలవుల ఎన్ క్యాష్ మెంట్ తదితర ఆర్థిక బకాయిల మాటేమిటి అని యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు శాంతి ప్రియ, జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, యుటిఎఫ్ జిల్లా నాయకులు అబ్దుల్ లతీఫ్ ప్రశ్నించారు.స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పోరాటాలు చేసిన ప్రతిసారి ఏదో ఒక మాట చెప్పి ప్రభుత్వం తప్పించుకుంటోందని, ఉపాధ్యాయులను మభ్యపెడుతూ పబ్బం గడుపుతోందని విమర్శించారు.వేల కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లించాలని యుటిఎఫ్ ఆధ్వర్యాన విజయవాడలో శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న కార్యకర్తలను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి ఉపాధ్యాయులు అని కూడా చూడకుండా ఈడ్చుకొని వెళ్లడం అమానుషమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పి ఆర్ సి విషయంలో కాలయాపన చేస్తోందని కావున 30 శాతం వరకు మధ్యంతర భృతి చెల్లించాలని,పి ఆర్ సి విధి విధానాలు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.మిగిలిన ఆర్థిక బకాయిలు చెల్లించేంత వరకూ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్లు చంద్ర మోహన్,హరి నారాయణ,మండల సహాధ్యక్షులు రమేష్ నాయుడు,ఆర్థిక కార్యదర్శి మధు,మండల సీనియర్ నాయకులు సాలయ్య,రాజన్న తదితరులు పాల్గొన్నారు.

About Author