సేవలు కొనసాగడం.. అభినందనీయం
1 min read- నగర మేయర్ బివి రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి
- భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు కుట్టుమిషన్లు, గ్రైండర్లు, ఇస్ర్తీ పెట్టెలు పంపిణీ
కర్నూలు, పల్లెవెలుగు:భగవాన్ శ్రీ బాలసాయిబాబా మన మధ్య లేకపోయినా…. ఆయన పేరుతో సేవలు కొనసాగడం ప్రశంసనీయమన్నారు నగర మేయర్ బివి రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు మదన గోపాల్, ఎస్వీ మోహన్ రెడ్డి. ఆదివారం నగరంలోని శ్రీ బాలసాయిబాబా దేవాలయ ఆవరణలో భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకలు, ప్రపంచ శాంతి సదస్సు ను సాయిబాబా సెంట్రల్ ట్రస్టు చైర్మన్ టి. రామారావు నేతృత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీవీ రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ బాల సాయిబాబా సేవా కార్యక్రమాల ద్వారా నిత్యం దేవుడి ఆరాధనలో గడిపిన ధన్య జీవులని కొనియాడారు. అనంతరం భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులు చదివేందుకు చెక్కు. మహిళలకు కుట్టుమిషన్లు, చిరు వ్యాపారులకు ఇస్ర్తీ పెట్టెలు, గ్రైండర్లు పంపిణీ చేశారు. ఆ తరువాత సాయిబాబా వారి 2024 సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాలసాయిబాబా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.