NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చీకటి జీ.ఓలను భోగి మంటల్లోకి …

1 min read

తగలబెట్టిన బి.టి.నాయుడు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు గౌ,, శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు ఈ రోజు కర్నూలు నగర పార్టీ అధ్యక్షులు నాగరాజు యాదవ్  ఆధ్వర్యంలో జగన్ ప్రభుతం ఇచ్చిన చీకటి జీఓలను భోగి మంటల్లో వేసి తగలబెట్టె కార్యక్రమం జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం ఎదుట నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు, యం.యల్.సి శ్రీ బి.టి.నాయుడు  పాల్గొని చీకటి జివో ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టడం జరిగింది.ఈ సంధర్బంగా బి.టి.నాయుడు  మాట్లాడుతూ వైసిపి ఎన్నికల మేనిఫెస్టో అయిన నవరత్నాలు మరియు జగన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలలో 85 శాతం ఫేయిల్ అయ్యాయని, జగన్ రెడ్డి పై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత కప్పిపుచ్చుకోవడానికి, ప్రతిపక్షం గొంతు నొక్కేసేందుకు తెరపైకి చీకటి జీ.ఓ 1 తెచ్చి పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతల కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపిన జగన్ రెడ్డి వికృత చేస్టలు, కక్ష సాధింపులతో 2023వ సంవత్సరం రాష్ట్రం ఆర్ధికంగా, అభివృద్ధిలో పూర్తిగా వెంకబడిపోయిందని, రాష్ట్రాన్ని  అభివృద్ధి పథంలో నడిపించే విజనరి నాయకుడు చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు.కార్యక్రమంలో ఉట్ల రమేశ్, నరసిమ్హ, అశోక్, రాజేశ్, శ్రీను, మోహన్,బుర్ర ఈశ్వరయ్య, రాజ శెఖర్ యాదవ్, సందీప్,పరమెశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెద్ది మొదలగు వారు పాల్గొన్నారు.

About Author