PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ ఉర్దూ పాఠశాలకు 100ఏళ్ళు పూర్తి…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరం లో గడియారం హాస్పిటల్ నందు ఉన్న ప్రభుత్వ ఉర్దూ బాయ్స్ పాఠశాల ఏర్పాటు చేసి 100ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ పాఠశాలలో వేడుకలను నిర్వహించారు. వంద సంవత్సరాల పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ పాఠశాల చెందిన పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సీనియర్ లీడర్ మొయిజ్ ఖాన్ కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్,పాల్గొన్ని సీనియర్ విద్యార్థులకు మొమెంటు అందజేసి శాలువా తో సన్మానించారు. పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, భోదించి ఉపాధ్యాయులు వారి అనుభూతిని పంచుకున్నారు.కర్నూలు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  కృషి చేశారని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  అన్నారు. ఉర్దూ మీడియం తోపాటు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టి ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు.ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  మాట్లాడుతూ ఈ పాఠశాలలో తన తండ్రి మొయిజ్ ఖాన్ , మరియు కుటుంబ సభ్యులు చదువుకున్నారని అన్నారు.మరింతగా ఈ పాఠశాల మౌళిక సదుపాయాలకు తన వంతు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం విద్య మరియు వైద్య కి పెద్ద పీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా మైనారిటీ అధికారి,అనీస్ ,హుస్సేన్ ,ఫరూక్ , అబ్దుల్ ఖాదీర్ ,అబ్దుల్ హఫీజ్ ఖాళీద్ ,నూరుల్లాహ్ ఖాద్రి , అబ్దుల్ లతీఫ్,అజస్ ,ఎండీ సాదిక్ , నూర్ అహ్మద్ ,డా! అబ్దుల్ సత్తర్ , సైఫ్ఉద్దీన్ ,ఆర్.కే ఖాజా మొహిద్దీన్ , ఇక్బాల్ అహ్మద్ , సయ్యద్ హుస్సేన్ , ఎండీ హుస్సేన్ , రామారావు , రామకృష్ణ రెడ్డి , పుష్ప రాజ్ , విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author