టిడిపి తోనే రైతుల సంక్షేమాభివృద్ధి:మాండ్ర
1 min read-అధికారంలోకి వస్తే పరిశ్రమలు యువతకు ఉద్యోగ అవకాశాలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: తెలుగుదేశం పార్టీతోనే రైతుల సంక్షేమ అభివృద్ధి చెందుతుందని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రమణమ్మ మరియు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన హాజరయ్యారు.ముందుగా భారీ ఊరేగింపుగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాండ్ర శివానందరెడ్డి మరియు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా గ్రామ సెంటర్లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాల పాలనలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నేర్చుకోలేదని ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ లేదని డీఎస్సీ మరియు గ్రూప్ వన్ గ్రూప్ టు ఉద్యోగాలు లేవని ఆ గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ముఖ్యంగా పొలాలకు సాగునీరు అందిస్తామని అదేవిధంగా ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు అందిస్తామని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మరియు 20 లక్షల ఉద్యోగాలు,పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.గ్రామస్తుల విన్నపం మేరకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికీ నీటి కుళాయి కనెక్షన్లు వేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.తర్వాత గ్రామంలో వేసిన సీసీ రహదారిని సర్పంచ్ రమణమ్మ మరియు మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ఈకార్యక్రమంలో నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి, ఎల్లారెడ్డి,రంగారెడ్డి, నందికొట్కూరు మాజీ ఎంపీపీ ప్రసాద రెడ్డి,రవీంద్రరెడ్డి, జయసూర్య,సుధాకర్ రెడ్డి, సంపంగి రవీంద్రబాబు, రమణారెడ్డి, నాగముని,నాగేంద్ర,రవికాంత్ రెడ్డి,రమణారెడ్డి,ఇద్రీస్ మరియు తదితరులు పాల్గొన్నారు.