పెన్నా నదిలో ఘనంగా ఉమామహేశ్వర పార్వేట ఉత్సవం
1 min read– పార్వేట ఉత్సవంలో పాల్గొన్న కాశీభట్ల సత్య సాయి నాధ శర్మ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలం కొండపేట పెన్నా నదిలో మంగళవారం సాయంత్రం కనుమ పండుగను పురస్కరించుకొని ఉమామహేశ్వర పర్వేటు ఉత్సవం ఉత్సవ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు, సాయంత్రం కొండపేట గ్రామంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి( శివాలయం) ఉత్సవ విగ్రహాలను నంది వాహనంపై ఊరేగింపుగా కొండపేట పెన్నా నది వద్దకు తీసుకువచ్చారు, వందలాదిమంది భక్తులు ఉమామహేశ్వర స్వామి లను దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. రెండు గంటల పాటు పెన్నా నదిలో భక్తుల దర్శనార్థం కమిటీ నిర్వాహకులు చెక్కభజన ఏర్పాట్లు చేశారు, చెన్నూరు గ్రామం తో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు, అనంతరం ఉమామహేశ్వర్లను ఊరేగింపుగా కొండపేట పురవీధుల గుండా నిర్వహించారు, కొండపేట పెన్నా నదిలో పార్వేట ఉత్సవంలో భాగంగా తిరుణాలత్సవం నిర్వహించారు, స్థానిక పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారిబందోబస్తు నిర్వహించారు, కనుమ పండుగ పురస్కరించుకొని చెన్నూరు కొండపేట వివిధ గ్రామాలకు చెందిన మహిళలు గొబ్బెమ్మలతో వివిధ నృత్యాలు చేసుకుంటూ పెన్నా నది వరకు వెళ్లి గొబ్బెమ్మలను పెన్నా నదిలో నిమగ్నం చేశారు……..ఈ కార్యక్రమంలో పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశీభట్ల సాయినాధ శర్మ పాల్గొనడం జరిగింది, ఈ సందర్భంగా సాయినాథ శర్మను ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ బాణాసంచా పేలుస్తూ ఆహ్వానించి శాలువాలతో పూలదండలతో ఘనంగా కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మను ఆలయ ధర్మకర్త వేణుగోపాల్ రెడ్డి సత్కరించడం జరిగింది, అలాగే ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలలో భాగంగా కనుమ నాడు చెన్నూరు లో జరిగే పార్వేట విశిష్టతను గురించి వేద పండితులు ఆయనకు తెలియజేయడం జరిగింది, ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను కలవడానికి కరాచలనం చేయడానికి పోటీపడ్డారు. కార్యనిర్వక నిర్వాహకులు, చెక్కభజన భజన బృందం కాశీభట్ల సాయినాథ శర్మనులతో శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సాయినాథ్ శర్మ మహిళా అభిమానులు, జింక రమాదేవి, శ్రీమతి జింక శ్రీలేఖ, కాంపల్లి రమ్యకృష్ణ రమ్యకృష్ణ,, పెద్ద బుద్ధి సురేఖ,, తుపాకుల విజయలక్ష్మి, తవ్వ సౌజన్య, తవ్వ కొండారెడ్డి, తుపాకుల జనార్దన్ రెడ్డి, పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్ మనోజ్ కుమార్,, జింక సాగర్ బాబు, జింక సురేష్, చల్లా మాధవరెడ్డి సుధాకర్ రెడ్డి, వడ్డే రాజారెడ్డి, కనపర్తి రామ్మూర్తి రెడ్డి, చెంగా బ్రహ్మయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.