భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో కరెక్షన్ ఉండబోతుందన్న వార్తలతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. అమెరికన్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ఆసియా మార్కెట్లు కూడ అప్రమత్తంగా కదులుతున్నాయి . దీంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ గ్యాప్ డౌన్ తో ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే.. శుక్రవారం నమోదయిన కనిష్టాల వద్ద సూచీలు ఈరోజు మద్దతు తీసుకున్నాయి. శుక్రవారం నమోదయిన కనిష్టం కిందికి మార్కెట్ కదిలితే.. సూచీలు మరింత పడే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల సమయంలో నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 15,608 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుండగా.. బ్యాంక్ నిఫ్టీ 227 పాయింట్లు నష్టపోయి.. 34,330 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది.