డిమాండ్లు తీర్చే దాకా సమ్మె ఆగదు…
1 min readఅంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ( జేఏసీ ) నేతల హెచ్చరిక…
వేతన పెంపు పైనే మా గురి… నామమాత్రపు చర్చలు మాకొద్దు? తక్షణ పరిష్కారం కావాలి..
తాటాకు చప్పులకు బెదరం..
అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ( ఏఐటీయూసీ, సిఐటియు, ఏపీ ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నేతలు )..
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: అంగన్వాడి డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె ఆగదని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ( జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ ) నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏపీ ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నేతలు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు, నాయకురాలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిమాండ్లలో ప్రధానమైన డిమాండ్ వేతన పెంపుపైనే మా గురి అన్నారు. పరిష్కారం కోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమని వారు స్పష్టం చేశారు. కోటి సంతకాలతో కూడిన మెమొరండాన్ని మంత్రులకు ఇవ్వకుండా నేరుగా ముఖ్యమంత్రి కి సమర్పించి డిమాండ్ల సాధనకై కృషి చేస్తామన్నారు. పలుమార్లు నామమాత్రపు చర్చలు జరిపి కాలయాపన చేస్తూ విఫలం చేస్తున్నారన్నారు. వినకపోతే ప్రత్యాన్మయం చూసుకుంటామని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని మంత్రుల కమిటీపై మండిపడ్డారు. ఎస్మా ప్రయోగిస్తే భయపడేది లేదన్నారు. బెదిరింపు చర్యలకు పాల్పడితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహించకుండా కోర్టును ధిక్కరిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను నిర్లక్ష్యం చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుండి ప్రాతినిథ్యం ఊహిస్తున్న అంగన్వాడి నేతలు హాజరయ్యారు. కడప జిల్లా, అన్నమయ్య జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ, నంద్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జల్లా చంద్రకళ, ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు సరళ, నంద్యాల జిల్లా నుంచి వెంకటసుబ్బమ్మలు హాజరయ్యారు.