గ్రామ సమస్యలపై పక్కాగా ప్రణాళికలు తయారు చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామాల అభివృద్ధి పై పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు అన్నారు, గురువారం స్థానిక మండల పరిషత్ సభా భవనంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ అధ్యక్షతన అధికారులు, ప్రజా ప్రతినిధులకు మండల స్థాయి గ్రామ పంచాయితీ అభివృద్ది ప్రణాళిక (GPDP) పై శిక్షణా కార్యకరమము నిర్వహించారు, ఈ కార్యక్రమానికి నందు ముఖ్య అధితిగా మండల అధ్యక్షులు, చీర్ల సురేష్ యాదవ్ పాల్గొని మాట్లాడడం జరిగింది మండల అధికారులు సచివాలయ సిబ్బంది సమన్వయంగా గ్రామాలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని వారు సూచించారు, అలాగే ఈ శిక్షణా కార్యక్రమంలో ఏవైతే అధికారులు చెప్పినవి తప్పక పాటిస్తూ వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని గ్రామస్థాయి నుండి, మండల స్థాయి వరకు అన్ని సమస్యల పైన, అన్ని పనుల పైన ప్రణాళికలు సిద్ధం చేయాలని వారు తెలియజేశారు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగము చేసుకొని 2024-2025 ఆర్థిక సంవత్సరమునకు సంబందించిన ప్రణాళికలు త్వరగా తయారు చేసుకొని egramaswaraj వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలసినదిగా వారికి తెలియజేశారు, ఈ ప్రణాళికలు తయారు చేయునపుడు గ్రామ పంచాయితీలలో అవసరమైన పనులను గుర్తించి గుర్తించిన పనులను విధిగా గ్రామ సభ నిర్వహించి గ్రామ సభల ఆమోదము తీసుకొనవలయునని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమములో ఎంఈఓ2 సునీత, ఈ ఓపిఆర్డి సురేష్ బాబు, ఏపిఎం గంగాధర్, అంగన్వాడి సూపర్వైజర్లు, గురమ్మ, నాగరత్నమ్మ, యం.పి.టి.సి సభ్యులు, సర్పంచులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.