వేతనాలు పెంచేదాకా పోరాటమే..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అంగన్వాడి కార్మికులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కుటుంబాలను వదిలి శాంతియుతంగా 38 రోజులుగా ఆందోళన కొనసాగిస్తుంటే వేతనాలు పెంచాల్సిన ముఖ్యమంత్రి మహిళా కార్మికులపై దౌర్జన్యం చేసే విధంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం సిగ్గుచేటని ఇలాంటి జిఓ ల వల్ల ఉద్యమాల ఆపే ప్రసక్తి లేదని ఎస్మా సంజాయిషీలను సీడీపీఓ కి ఇచ్చి నిరసన ధర్నా చేశారు.ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వి. రఘురామమూర్తి,రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ బాబులు కోరారు. గురువారం నందికొట్కూరు పట్టణం లోని ఏఐటీయూసీ కార్యాలయం నుండి సీడీపీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎస్మా జీవో సంజయిసి లెటర్స్ నీ సీడీపీఓ కార్యాలయం లో అందజేశారు . సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న లక్ష పేద కుటుంబాలకు చెందిన అంగన్వాడీ కార్మికులు గొంతెమ్మ కోరికలు అడగడం లేదని మంత్రులు ముఖ్యమంత్రులు ఆస్తులు అడగడం లేదని గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని అడుగుతున్నారని అటువంటి హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పాటుపడుతుందని పెద్ద పెద్ద ప్రగల్బాలు పలికే ముఖ్యమంత్రి వేతనాల సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని వారు ఏద్దేవా చేశారు. 38 రోజులుగా సమ్మె చేస్తుంటే ఏమి చేస్తుందని చర్చల పేరుతో కాలయాపన చేస్తూ వారి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రభుత్వమే దారితీసింది అన్నారు.తక్షణమే కనీస వేతనం అమలు చేసి, గ్రాడ్యుటి రిటర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేసేంతవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మద్దతుగా సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు దినేష్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో యూనియన్ నాయకులు కమలమ్మ , సువర్ణ , నాగేశ్వరమ్మ , కాత్యాయని, తదితరులు పాల్గొన్నారు.