PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌జ‌ల కోసం తెలుగుదేశం ఎప్ప‌టికీ ఉంటుంది..

1 min read

క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు, ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్ప‌టికీ ఉంటుంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. ఎన్టీఆర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి, క‌ర్నూలు పార్ల‌మెంటు అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ బి.టి నాయుడు, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమిశెట్టి వెంకటేశ్వ‌ర్లుతో క‌లిసి ఆయ‌న ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాలలు వేసి నివాళుల‌ర్పించారు. ఎన్టీఆర్ స‌ర్కిల్లో ఉన్న విగ్ర‌హానికి పూల‌మాలలు వేశారు. అనంత‌రం అక్ష‌య బ్ల‌డ్ బ్యాంకులో టి.జి భ‌ర‌త్ ఆధ్వ‌ర్యంలో లెజెండ‌రీ బ్ల‌డ్ డొనేష‌న్ డ్రైవ్ కార్య‌క్ర‌మం ఏర్పాటుచేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ర‌క్త‌దానం చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో బి.టి నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఓ చ‌రిత్ర అన్నారు. ఆయ‌న ప‌రిపాల‌నలో పేద ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం జ‌రిగింద‌న్నారు. ఇక రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు చారిత్రాత్మ‌క‌మైన నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ పార్టీని స్థాపించిన 9 నెల‌ల్లోనే అధికారంలోకి తీసుకువ‌చ్చిన గొప్ప నాయ‌కుడు ఎన్టీఆర్ అన్నారు. పేద ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ఎన్నో మంచి సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయ‌కులు రాజ‌కీయాల్లో చాలా అరుదుగా ఉంటారన్నారు. వ‌ర్థంతి సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన ర‌క్త‌దాన కార్య‌క్ర‌మంలో ఎప్పుడూ ర‌క్త‌దానం చేయ‌నివారు సైతం స్వ‌త‌హాగా ముందుకొచ్చి రక్త‌దానం చేశారని తెలిపారు. 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత పార్టీ ప‌నైపోయింద‌ని అంతా అనుకున్నారని.. ఎన్ని ఓట‌ములు ఎదురైనా తట్టుకొని ఎదురొడ్డి ప్ర‌జ‌ల కోసం పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్ప‌టికీ ఉంటుందన్నారు. అధినేత చంద్ర‌బాబు నాయుడు పార్టీలోని ఎంతో మంది నాయ‌కుల‌ను ఆయ‌న‌లాగే నిబ‌ద్ద‌త‌తో పనిచేసేలా తీర్చిదిద్దారన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం గెలిస్తేనే ప్ర‌జ‌ల‌కు మెరుగైన భ‌విష్య‌త్తు ఉంటుందన్నారు. అనంత‌రం సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ టిడిపి మ‌ళ్లీ అధికారంలోకి రాబోతుంద‌న్నారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతో తాము ఎన్నిక‌ల‌కు వెళుతున్న‌ట్లు చెప్పారు. ఏ త‌ప్పు చేయ‌ని చంద్ర‌బాబును జ‌గ‌న్ జైళ్లో పెట్టార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నేత‌లు నాగ‌రాజు యాద‌వ్, కె.యి జ‌గ‌దీష్‌, పోతురాజు ర‌వి, కె.వి సుబ్బారెడ్డి, కార్పోరేట‌ర్లు ప‌ర‌మేష్‌, ప‌ద్మ‌ల‌తారెడ్డి, మన్సూర్ ఆలీఖాన్, సోమిశెట్టి న‌వీన్, ల‌క్కీటూ గోపి, అబ్బాస్, దాశెట్టి శ్రీనివాసులు, శ్రీనివాస్ భట్, గున్నామార్క్, రామాంజ‌నేయులు, దేవా, మ‌హిళా నాయ‌కురాలు ముంతాజ్, విజయలక్ష్మి, జనసేన నేత పవన్, టిడిపి నేతలు ఏసు, మోతిలాల్, చేపల రమేష్, బాలు, సురేష్, పెంచలయ్య, టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అనుబంధ విభాగాల నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author