రంగస్థల కళాకారులు.. ఎన్టీఆర్ కి ఘన నివాళి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు నగరం ఎన్టీఆర్ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పి హనుమంతరావు చౌదరి బైలుప్పల షఫీయుల్లా శ్రీమతి లక్ష్మి పద్మా చౌదరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు గుర్రపుసాల అంకయ్య ,వివి రమణారెడ్డి, ఈ సందర్భంగా పి హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ,నందమూరి తారక రామారావు గారి జీవితం కళాకారులకు ఆదర్శమని నాటి రంగస్థలానికి నేటి సామాజిక నాటికలకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని అన్నారు. నందమూరి తారక రామారావు నంది నాటకోత్సవాలను ప్రారంభించి ఎందరో రంగస్థల కళాకారులకు గుర్తింపు ఇచ్చారని ఎన్టీఆర్ అవార్డు ద్వారా ప్రోత్సహించారని, మన కర్నూలు సీనియర్ కళాకారులు లొద్దిపల్లి అల్లా బకాష్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారని, ఎన్టీఆర్ నట జీవితం రాజకీయ జీవితం నేటి యువతరానికి ఆదర్శమని హనుమాన్ కళా సమితి అధ్యక్షులు పి హనుమంతరావు చౌదరి, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం అధ్యక్షులు బైలుప్పల షఫీయుల్లా అన్నారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు పి హనుమంతరావు చౌదరి వివి రమణారెడ్డి గుర్రపుసాల అంకయ్య బైలుప్పల షఫీయుల్లా టీవీ రెడ్డి పీజీ వెంకటేశ్వర్లు కళాప్రియ తిరుపాలు వివి రమణాచారి డీ పుల్లయ్య పి దస్తగిరి శ్రీ చెన్న కృష్ణ బీసన్న నరసయ్య చౌదరి డి పార్వతయ్య శ్రీనివాసులు రామకృష్ణ కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు పాల్గొని నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి ఘన నివాళి అర్పించారు.