పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయండి
1 min readజేసీకి వినతిపత్రం అందజేసిన టీఎన్ఎస్ఎఫ్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కరోన థర్డ్‌వేవ్ వస్తుందని శాస్ర్తవేత్తలు, వైద్యనిపుణులు పేర్కొంటున్నారని, ఈ క్రమంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం సరికాదని టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంట్ కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని కోరారు. ఇందుకు డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ , పాణ్యం మాజీ ఎమ్మెల్యేగౌరు చరితరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ , నాగేంద్ర కుమార్ , పోతురాజు రవి కుమార్ , ఆకేపోగు ప్రభాకర్ , దరూరు జేమ్స్ , సత్రం రామకృష్ణుడు , తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు రెడ్డిపోగు బజారన్న తదితరులు మద్దతు ఇచ్చారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రాంసుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కరోన బారిన పడి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, సాదారణ మరణాలకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు రాజు యాదవ్ , జలాల్ , ఉస్మాన్, రాజశేఖర్, బజార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో హన్మంతరావు చౌదరి, బొగ్గుల రాజశేఖర్ గారు, జలీల్ బాషా తదితరులు పాల్గొన్నారు.