PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల కేంద్రంలో దుమ్ము దుమ్మే..

1 min read

-స్పీడ్ బ్రేకర్లు సీసీ కెమెరాలు నిల్

-అధికారులు గొప్ప గొప్ప ఉపన్యాసాలకు పరిమితం..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల కేంద్రానికి వివిధ గ్రామాల ప్రజలు పనుల నిమిత్తం వస్తే దుమ్ము దుమ్ము కొట్టుకోవాల్సిందే విపరీతమైన దుమ్ము వల్ల విద్యార్థులు ప్రజలు మహిళలు మొహానికి బట్ట అడ్డు పెట్టుకోవాల్సిందే నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో..ఈ మండలంలో 19 పంచాయితీలు 24 గ్రామాలు నందికొట్కూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లోనే ఇది చాలా పెద్ద మండలం.మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలు హాస్టల్లు మరియు జూనియర్ కళాశాలలకు నిత్యం వివిధ గ్రామాల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో విద్యను అభ్యసించడానికి మండల కేంద్రానికి వస్తూ ఉన్నారు.రోడ్డు మీద ఏ చిన్న వాహనం వెళ్లినా మరియు ఈ రహదారిలోనే పెద్ద పెద్ద వాహనాలు టిప్పర్లు కంకర మరియు ఎర్రమట్టితో వాహనాలు వెళ్తున్నా అధిక లోడుతో వెళ్లే వాహనాల వల్ల పక్క మండలం అయిన గడివేముల మండల కేంద్రంలో అనుమతి లేని పెద్ద టిప్పర్ టైర్ల కింద పడి చెరుకుచెర్ల గ్రామానికి చెందిన పద్మావతమ్మ అనే మహిళ ఈనెల 14వ తేదీన టైర్ల కింద పడి దుర్మరణం చెందారు.కానీ ఇలాంటి సంఘటనలు మండల కేంద్రంలో జరగకుండా అధికారులు ముందస్తుగా ఇలాంటి వాహనాల పట్ల వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ ఉండటం వల్ల అధికారుల పట్ల మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మండల కేంద్రంలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఆటో స్టాండ్ వద్ద వాహనదారులు బైకులు కార్లు ఆటోలు తదితర వాహనాలు విపరీతమైన వేగంతో రావడం వల్ల విద్యార్థులకు మరియు ప్రజలకు గాయాలు అవుతున్నాయ్..కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని మండల ప్రజలు అంటున్నారు. ఆటో స్టాండ్ వద్ద రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి మీటర్ వరకు నీళ్లు రోడ్లమీద పారుతూ ఉండడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని వివిధ గ్రామాల ప్రజలు అంటూ ఉన్నారు. వర్షాకాలం వచ్చేలోపు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని ప్రజల కోరుతున్నారు.అంతేకాదు మరో విషయానికి వస్తే మండల కేంద్రంలో గానీ నందికొట్కూరు ప్రధాన రహదారిలో గానీ సిసి కెమెరాలు లేకపోవడం వల్ల దొంగతనాలు మరియు వాహనాలను అనుమానిత వ్యక్తులను గుర్తించడానికి కష్టతరంగా ఉంటుందని ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఎవ్వరు చూసినా గొప్ప గొప్ప ఉపన్యాసాలకే తప్పా ఆచరణలో మాత్రం శూన్యం. మరి రాబోయే రోజుల్లో నైనా అధికారుల్లో మార్పు వస్తుందా లేదా వేసి చూడాలి మరి.

About Author