నిరుపయోగంగా ఉన్న చెక్ బుక్ లను పంచనామా
1 min read– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కలెక్టరేట్ జిల్లా ఖజానా స్ట్రాంగ్ రూమ్ లో నిరుపయోగంగా ఉన్న చెక్ బుక్ లకు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పంచనామా నిర్వహించారు.శనివారం కలెక్టరేట్ లోని జిల్లా ఖజానా స్ట్రాంగ్ రూమ్ లో నిరుపయోగంగా ఉన్న చెక్ బుక్ లకు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పంచనామా నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిఓఎంఎస్ నెం.135 ప్రకారం జిల్లా స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించుకొని నిరుపయోగంగా ఉన్న చెక్ బుక్ లను పంచనామా చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీలలో ఉన్న 2071 చెక్ బుక్ లన్నింటిని తెప్పించి కలెక్టరేట్ ప్రక్కన ఉన్న షటిల్ కోర్టులో ఒక్కొక్క చెక్ బుక్ ను పరిశీలించి వాటిని పంచనామా చేయడం జరిగిందన్నారు.కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, ఖజానా శాఖ డిడి రామచంద్రరావు, జిల్లా అగ్నిమాపక అధికారి వెంకటరాయుడు, ఏటిఓలు జయలక్ష్మి, సుబ్బారాయుడు, స్ట్రాంగ్ రూమ్ ఎస్టీఓ కరుణాకర్, సునీల్, ట్రెజరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.