పొదుపు మహిళల సమస్యల ను పరిష్కరించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పొదుపు మహిళల సమస్యల ను పరిష్కరించాలని కర్నూలు మెప్మా పిడి నాగ శివ లీల కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత 30 సంవత్సరాల నుండి పొదుపు మహిళలు ప్రతి నెల పొదుపులు జమ చేసుకుంటూ తీసుకున్న లోనును సక్రమంగా కట్టుకుంటూ గ్రూపులను ఎంతో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు అయితే చాలా బ్యాంకుల యందు లోన్ వచ్చిన ప్రతిసారి 8 వేల నుండి పదివేల వరకు సర్ చార్జీల పేరుతో చార్జెస్ వేస్తూ వస్తా ఉన్నారు. ఆడి పేరుతో డిపాజిట్ చేయించుకుంటున్నారు వారి సొంత పొదుపు అకౌంట్ నుండి పొదుపు డబ్బులు అత్యవసరాలకు డ్రా చేసుకోనివ్వడం లేదు అభయ హస్తం కట్టిన సభ్యులకు చాలామందికి ఇంతవరకు పెన్షన్ గాని స్కాలర్షిప్ కానీ రావడం లేదు వీరికి పెన్షన్ వెంటనే మంజూరు చేయాలి లేదా వారు కట్టినటువంటి డిపాజిట్ సొమ్మును తిరిగి వెనక్కి ఇవ్వాలని అలాగేశ్రీనిధి పేరుతో లక్షల రూపాయలు డిపాజిట్ కింద పెట్టుకొని పొదుపు మహిళలకు శ్రీనిధి లోన్లు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వారికి లోన్లైన మంజూరు చేయాలి లేదా వారు పెట్టిన డిపాజిట్ సొమ్మును తిరిగి వారి హెచ్ ఎస్ జి ఖాతాలకు జమ చేయాలి అలాగే వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీసుకున్న రుణ మొత్తానికి సున్నా వడ్డీని వర్తింప చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మూడు లక్షల రూపాయలకు మాత్రమే సున్నా వాడిని పరిమితం చేశారు కనుక తీసుకున్న రుణం మొత్తానికి 0 వడ్డీని వర్తింపచేయాలని పొదుపు సంఘాల మహిళలకు వృత్తి శిక్షణ కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చి వారు తయారు చేసినటువంటి వస్తువులకు డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేయాలని పొదుపు సంఘాలకు సంబంధించిన పుస్తకాలను సంవత్సరానికి ఒకసారి మార్చాలి అనే డిమాండ్ ను రద్దు చేయాలని కనీసం మూడు సంవత్సరాలకు సరిపడా పుస్తకాలను అచ్చు వేయించాలని ఐద్వాగ పిడిని కోరడం జరిగింది మెక్మా పీడీ స్పందిస్తూ నా పరిధిలో ఉండేటువంటి సమస్యలను పరిష్కారమయ్యేలాగా చూస్తానని నా పరిధిలో లేని సమస్యలు పై అధికారులకు పంపుతామని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి యన్ అలివేలు జిల్లా నాయకులు జె కిరణ్మయి కుమారి పర్వీన్ మాధురి తదితరులు పాల్గొన్నారు.