బెదిరించడం కాదు..జీతాలు పెంచండి…
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: అంగన్వాడీలను బెదిరించడం కాదు వారికి జీతాలు పెంచండి అని మిడుతూరు టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో అంగన్వాడీల దీక్షలు 40 రోజులకు చేరుకున్నాయి. ప్రభుత్వం అంగన్వాడీలను తొలగిస్తామని బెదిరించడం మాని జీతాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ అంగన్వాడి సమ్మె స్టేట్ బ్యాంకు దగ్గర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై కక్షపూరితంగా వేధించడం మంచిది కాదన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని గ్రాటివిటీ అమలు చేయాలని 40 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీలను తొలగిస్తామని బెదిరించడం సమంజసం కాదన్నారు ఇలాంటి బెదిరింపులకు అంగన్వాడీలు భయపడబోరని ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రఘురాంమూర్తి మరియు రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నారాయణ,ఓబులేష్, లింగస్వామి, నాగమణి,శారద,గౌతమి, ప్రసన్న మరియు తదితరులు పాల్గొన్నారు.