వాల్మీకులను… ఎస్టీలుగా గుర్తించాల్సిందే…
1 min readఎస్టీలుగా పునరుద్ధరించేంతవరకు పోరాడుదాం
వాల్మీకి యువసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సంఘీభావం ప్రకటించిన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి వాల్మీకి. వాల్మీకి బోయాలకు గతంలో ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను పునరుద్ధరించేంతవరకు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువసేన తరపున నిరంతరం పోరాడుతూనే ఉంటామని వాల్మీకి యువసేన రాష్ట్ర అధ్యక్షులు వినోద్ వాల్మీకి అన్నారు. శనివారం కర్నూల్ నగరంలోని అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించాలని పెద్ద సంఖ్యలో హాజరై నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ వాల్మీకి బోయలను కేవలం ఓటు బ్యాంకు గానే నేతలు చూడడం బాధాకరమన్నారు. ప్రభుత్వం మాయమాటలు చెప్పి బోయ కులస్తులను లను మోసగించిందన్నారు.రానున్న ఎన్నికల్లో బోయవాల్మీకులు సత్తా కచ్చితంగా చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ వాల్మీకిలకు అండగా బీసీవైపి పార్టీ ఎల్లప్పుడు నిలుస్తుందని అన్నారు.వాల్మీకి నాయకులు తన వెంట వస్తే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లి న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలతో పాటు వాల్మీకులను సైతం అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పార్థసారధి వాల్మీకి మాట్లాడుతూ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో వైకాపా పార్టీ ఎప్పుడు విఫలం చెందుతూనే ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి యువసేన రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ ,ఉపాధ్యక్షుడు శేషు శ్రీనివాసులు , అంజి,క్రాంతి నాయుడు, రంగముని నాయుడు, తలారి కృష్ణ, కుబేర స్వామి, లక్ష్మణ్, కృష్ణుడు, వెంకటేశ్వర్లు , నాగరాజు నాయుడు , జిల్లా నుంచి వాల్మీకులు 2000 మంది హాజరయ్యారు.